Fri Feb 14 2025 18:46:29 GMT+0000 (Coordinated Universal Time)
అతిపెద్ద ఆసుపత్రి ఉస్మానియాకు రేవంత్ శంకుస్థాపన
గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు

గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మొత్తం 2,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేస్తున్నారు. 32లక్షల చదరపు అడుగులతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మాణం చేయనున్నారు. ప్రయివేటు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా దీనిని నిర్మించబోతున్నారు. 26.30 ఎకరాల్లో ఈ కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందుబాటులోకి తేనున్నారు. అన్ని రకాల సర్జరీలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు.
అత్యున్నత ప్రమాణాలతో...
ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో ఈ ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నారు. రెండు వేల పడకలతో పన్నెండు అంతస్థులతో రోజుకు ఐదు వేల మంది రోగులకు వైద్య సేవలు అందించే విధంగా ఈ ఆసుపత్రినిర్మాణం చేపట్టనుంది. మొత్తం 30 డిపార్ట్ మెంట్లను ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్నారు. అయితే గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులతో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
Next Story