Thu Dec 18 2025 22:59:36 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్... మరో ఐటీ పార్క్
హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్ అందనుంది. త్వరలోనే మరో భారీ ఐటీ పార్క్ రానుంది

హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్ అందనుంది. త్వరలోనే మరో భారీ ఐటీ పార్క్ రానుంది. సింగపూర్ ప్రభుత్వంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో ఐటీ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. 450 కోట్ల రూపాయల వ్యయంతో సింగపూర్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ ఐటీ పార్క్ తో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
సింగపూర్ పర్యటనలో...
అదే సమయంలో హైదరబాద్ ను బిజినెస్ కాపిటల్ గా చేసేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడుల కోసం గత రెండు రోజులుగా సింగపూర్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఇప్పటికే 3,500 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈరోజు రాత్రికి బయలుదేరి ముఖ్యమంత్రి బృందం దావోస్ బయలుదేరి వెళ్లనుంది.
Next Story

