Fri Dec 05 2025 15:13:27 GMT+0000 (Coordinated Universal Time)
డాక్టర్ బి. రేష్మకు నేషనల్ గోల్డ్ మెడల్.. అభినందనల వెల్లువ
కోఠీ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న రేష్మకు జాతీయస్థాయిలో గోల్డ్మెడల్ సాధించారు.

కోఠీ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న రేష్మకు జాతీయస్థాయిలో గోల్డ్మెడల్ సాధించారు. కోఠీ ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్నారు. ఆమెకు జాతీయ స్థాయిలో నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ గోల్డ్ మెడల్ ను ఇచ్చింది. ఈ సంస్థ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఎస్. కామేశ్వరన్ గోల్డ్ మెడల్ కు రేష్మా ఎంపిక అయ్యారు.
మే నెల పదోతేదీన ఢిల్లీలో...
మే నెల 10వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో డాక్టర్ రేష్మకు ాడాక్టర్ కామేశ్శరన్ అవార్డును నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ ప్రదానం చేయనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కు ఎంపికైన రేష్మాను కోఠీ ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆమెను అభినందించారు. 2021లో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలోని పీజీ డిగ్రీ పరీక్షల్లో అనని స్పెషాలటీస్ లో టాపర్ గా నిలిచారు. ఆమెకు సూపరిండెంట్ తో పాటు సిబ్బంది కూడా అభినందనలు తెలిపారు.
Next Story

