Fri Apr 10 2026 01:48:33 GMT+0530 (India Standard Time)
ఒవైసీ సోదరులపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్
ఒవైసీ సోదరులపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు

ఒవైసీ సోదరులపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. తమకు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువులు లేకుండా చేస్తామని ఒవైసీ అన్నారని, పదిహేను గంటలు.. కాదు... పదిహేను రోజులు కాదు.. పదిహేను సంవత్సరాలు ఇచ్చినా మాకు ఏం కాదని రాజాసింగ్ అన్నారు. ఎక్కడికి రావాలో చెప్పు అక్కడికి వస్తానంటూ రాజాసింగ్ సవాల్ విసిరారు.
ఎక్కడికి రమ్మన్నా...
నువ్వుండే ప్రాంతానికైనా తాను వస్తానని, లేదా మీ ఇష్టమొచ్చిన చోటికి రామ్మన్నా వస్తాననని ఏం చేస్తావో చూస్తానని రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఎవరు ఎక్కడికి వచ్చినా చేసేదేమీ లేదని తెలుసనని, అయినా అవాకులు, చెవాకులు పేలుతూ ముస్లిం ఓట్లను పొందడానికే ప్రయత్నిస్తున్నావంటూ రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story

