Mon Mar 30 2026 20:13:00 GMT+0530 (India Standard Time)
Hyderabad : హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతుంది

హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతుంది. హయత్ నగర్, ఎల్.బి. నగర్, కొత్తపేట, సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట ప్రాంతాల్లో వాన కురుస్తుంది. అయితే ఉన్నట్లుండి వానలు పడటంతో పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి.
కార్యాలయానికి వెళ్లిన వారు...
దీంతో కార్యాలయానికి వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు ఇంటికి చేరుకునేందుకు అవస్థలు పడుతున్నారు. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వాన కొద్దిసేపు కురిసినప్పటికీ రహదారుల జలమయంగా మారడంతో ట్రాఫిక్ కు పలు చోట్ల సమస్యలు ఏర్పడ్డాయి.
Next Story

