Sun Mar 15 2026 14:28:08 GMT+0530 (India Standard Time)
శివారు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం?
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభం అయింది

హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను రెడీ చేసినట్లు తెలసింది. హైదరాబాద్ నగరంలో ఉన్న శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో దాని ప్రక్రియ నిలిచిపోయింది.
త్వరలో ఉత్తర్వులు...
అయితే కోడ్ ముగిసిన తర్వాత విలీన ప్రకటన ప్రభుత్వం చేయనుందని తెలిసింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఉత్తర్వులను బయటకు విడుదల చేయలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ నగరాన్ని ఐదు జోన్లుగా విభజించి జోన్ కు సమీపంలో ఉన్న మున్సిపాలిటీని విలీనం చేయనున్నారు.
Next Story

