Sat Mar 21 2026 06:04:48 GMT+0530 (India Standard Time)
Narendra Modi : రేపు హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో
ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ కు రానున్నారు. మూడు రోజుల పాటు తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ కు రానున్నారు. మూడు రోజుల పాటు తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం మల్కాజ్గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మోదీ రోడ్ షోకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు సాయంత్రం మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు మోదీ రోడ్ షో జరగనుంది.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో...
మల్కాజ్గిరిలో లోక్సభ పరిధిలో 1.3కిమీ మేర ప్రధాని రోడ్ షో ఉండ నుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 16వ తేదీన నాగర్కర్నూల్ నియోజకవర్గంలో జరనున్న బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ నెల 18వ తేదీన జగిత్యాల బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

