Thu Mar 19 2026 00:49:27 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ శీతాకాలం విడిదికి వచ్చారు. ఈరోజు నుంచి 21వతేదీ వరకూ రాష్ట్రపతి హైదరాబాద్ లోనే ఉంటారు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ శీతాకాలం విడిదికి వచ్చారు. ఈరోజు నుంచి 21వతేదీ వరకూ రాష్ట్రపతి హైదరాబాద్ లోనే ఉంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈరోజు రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి నిలయంలో ఉన్న ద్రౌపది ముర్మును పలువురు ప్రముఖులు నేటి నుంచి కలిసే అవకాశముంది.

ఈ నెల 20వ తేదీన...
ఈ నెల 20వ తేదీన సికింద్రాబాద్ లో డిఫెన్స్ మేనేజ్ మెంట్ కళాశాలను రాష్ట్రపతి సందర్శిస్తారు. అనంతరం డిఫెన్స్ మేనేజ్ మెంట్ కళాశాల విద్యార్థులకు స్కాలర్స్ ను రాష్టప్రతి ప్రదానం చేస్తారు. 20వ తేదీన సాయంత్రం ఎట్ హోంకార్యక్రమంలో పాల్గొంటారు. ఈనెల 21వ తేదీన చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీని సందర్శిస్తారు. అనంతరం కోటి మహిళా కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

