Fri Dec 12 2025 04:42:44 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు లొంగిపోనున్న ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన మరి కాసేపట్లో లొంగిపోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు బెయిల్ ను రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఒకరోజులో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో...
ఆయనను ఫిజికల్ గా టార్చర్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. దీంతో పాటు వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి కూడా సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో నేడు ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదయిన తర్వాత విదేశాలకు వెళ్లిన ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ఈ కేసులో పలుమార్లు ప్రభాకర్ రావును పోలీసులు విచారించారు.
Next Story

