Fri Dec 05 2025 23:01:41 GMT+0000 (Coordinated Universal Time)
Kalpana : కల్పన నిద్రమాత్రలు మింగింది అందుకేనా?
ప్రముఖ సింగర్ కల్పన అపస్మారక స్థితికిలోకి వెళ్లారు

ప్రముఖ సింగర్ కల్పన అపస్మారక స్థితికిలోకి వెళ్లారు. హైదరాబాద్ లో నిజాంపేటలో నివాసముంటున్న కల్పన నిన్న సాయంత్రం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ విషయం తెలిసిన బంధువులు వెంటనే ఆమెను ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. చెన్నైలో ఉన్న తన భర్తకు కల్పన ఫోన్ చేసి తాను అపస్మారక స్థితిలోకి వెళుతున్నట్లు చెప్పడంతో ఆయన వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు.
నిద్రమాత్రలు మింగడంతో...
వారు వచ్చి ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే కల్పన గత కొంతకాలంగా తనకు నిద్ర పట్టడం కోసం నిద్రమాత్రలను మింగుతున్నట్లు ఆమె భర్త ప్రసాద్ ప్రభాకర్ తెలిపారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, ఆయన చెప్పినట్లు స్థానికులు తెలిపారు. అయితే కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

