Thu Mar 19 2026 07:19:48 GMT+0530 (India Standard Time)
Rajinikanth : నాగోలు మెట్రో స్టేషన్ లో రజనీకాంత్
ప్రముఖ నటుడు రజనీకాంత్ నాగోల్ మెట్రో స్టేషన్ కు వచ్చారు. అక్కడ ఉన్న ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ను ఆయన పరిశీలించారు

ప్రముఖ నటుడు రజనీకాంత్ నాగోల్ మెట్రో స్టేషన్ కు వచ్చారు. అక్కడ ఉన్న ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. హైదరాబాద్ లో మెట్రో సేవలు అక్కడి నుంచే ఆపరేట్ చేస్తారు. ఇక్కడి నుంచి ఆపరేషన్ జరిగే తీరును రజనీకాంత్ అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒక సినిమా షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన రజనీకాంత్ ను మెట్రో స్టేషన్ సందర్శించాలని నిర్వాహకులు కోరగా అందుకు ఆయన సమ్మతించి నాగోలు మెట్రో స్టేషన్ కు వచ్చారు.
అధికారుల అభ్యర్థన మేరకు...
రజనీకాంత్ కు మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి, ఛీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ సుధీర్ చిప్లూలంకర్, సీఎస్ఓ మురళి వరదరాజన్ లు స్వాగతం పలికారు. అక్కడ ఆపరేషన్ ఎలా జరిగేది ఆయనకు వివరించారు. కాగా రజనీకాంత్ తో సెల్ఫీలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు. రజనీకాంత్ మెట్రో స్టేషన్ కు రావడంతో ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడ అభిమానులు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన అందరికీ అభివాదం చేస్తూ ఉల్లాసంగా గడిపారు.
Next Story

