Fri Mar 20 2026 23:31:13 GMT+0530 (India Standard Time)
పోలీసులకు చుక్కలు చూపుతున్న మందుబాబులు
హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. అర్థరాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ ను నిర్వహించారు. అయితే పూటుగా మద్యం సేవించిన మందుబాబులు పోలీసులపై తిరగబడ్డారు.
రోడ్డుపై పడుకుని.....
బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లు చేయవద్దంటూ హంగామా సృష్టించారు. రోడ్డుపై అడ్డంగా పడుకుని మందుబాబులు తమ నిరసనను వ్యక్తం చేశారు. కొందరు హిజ్రాలు కూడా పోలీసులతో గొడవకు దిగారు. మేడ్చల్ ఎమ్మెల్యే అనుచరులమని, తమను వదిలేయాలంటూ గోల గోల చేశారు. అయితే సరైన పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Next Story

