Thu Mar 12 2026 09:53:37 GMT+0530 (India Standard Time)
Hyderabad : గ్యాస్ కొరతతో సైబర్ నేరాళ్ల వల..హై అలెర్ట్ : సజ్జనార్
గ్యాస్ కొరతను అవకాశంగా సైబర్ నేరగాళ్లు మలచుకుంటున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు

గ్యాస్ కొరతను అవకాశంగా సైబర్ నేరగాళ్లు మలచుకుంటున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడే అవకాశముందని తెిపారు. త్వరగా గ్యాస్ ఇప్పిస్తామంటూ నకిలీ వెబ్సైట్లు, యాప్‌లతో వల వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తున్నారని, వాట్సప్ మెస్సేజులు, లింకులతో సైబర్ నేరగాళ్లు గాలం వేస్తున్నారన్నారు.
ఆన్ లైన్ ముందుగా...
ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే త్వరగా సరఫరా చేస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారన్నారు. త్వరగా గ్యాస్ ఇప్పిస్తామని వచ్చే మెసేజ్ లు నమ్మొద్దంటున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని, అధీకృత కంపెనీ వెబ్సైట్ల నుంచే బుక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే సైబర్‌క్రైం హెల్ప్‌లైన్ నెంబరుకు 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్న పోలీసులు, cybercrime.gov.in వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు తెలిపారు.
Next Story

