Sat Mar 07 2026 10:50:59 GMT+0530 (India Standard Time)
బంజారాహిల్స్లో భారీగా నగదు స్వాధీనం
హైదరాబాద్ బంజారా హిల్స్ లో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ బంజారా హిల్స్ లో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన తర్వాత ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు కట్టల కొద్దీ నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా బంజారాహిల్స్లో 3.35 కోట్ల నగదును ఒక కారులో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్డ నెంబరు 3లో వస్తున్న కియా కారును ఆపి పోలీసులు వాహనాన్ని తనిఖీలు చేయగా ఈ నగదు బయటపడింది.
హవాలా నగదును...
ఇంత భారీ మొత్తంలో నగదు తీసుకు వెళుతున్న వ్యక్తుల వద్ద నుంచి ఎలాంటి ఆధారాలు కూడా లేకపోవడంతో నగదుతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అన్న ప్రశ్నలకు కారులో ఉన్న నలుగురు వ్యక్తుల నుంచి సమాచారం పోలీసులకు లభించలేదు. ఇది హవాల ధనంగా పోలీసులు గుర్తించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. నిన్న షెడ్యూల్ విడుదలయితే గంటల్లోగానే భారీగా నగదు పట్టుబడటం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story

