Sun Mar 08 2026 04:09:53 GMT+0530 (India Standard Time)
Breaking : మాదాపూర్ లో భారీగా నగదు స్వాధీనం... పదిహేను బాక్సుల నిండా నగదును చూసిన పోలీసులు
మాదాపూర్ లో పెద్దయెత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పదిహేను కార్టన్ల నిండా క్యాష్ ను పట్టుకున్నారు

మాదాపూర్ లో పెద్దయెత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పదిహేను కార్టన్ల నిండా క్యాష్ ను తీసుకెళుతున్న కార్లలో నుంచి పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. కియా కార్లలో ఈ నగదును తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులకు తనిఖీలు నిర్వహించగా పెద్ద మొత్తంలో నగదు బయట పడింది.
ఎక్కడి నుంచి...?
అయితే ఈ నగదు ఎంత ఉంటుందన్నది ఇంకా తెలియరాలేదు. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు కార్లతో పాటు అందులోని కొందరు వ్యక్తులను కూడా అదుపులోి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ నగదును ఎక్కడి నుంచి ఎక్కడకు తీసుకెళుతున్నాన్న దానిపై ఇంకా సమాచారం రావాల్సి ఉది. పదిహేను బాక్సుల నిండా నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story

