Fri Dec 05 2025 07:17:05 GMT+0000 (Coordinated Universal Time)
Kukatpally Girl Murder Case : తల్లి గుర్తించింది.. కానీ నన్నే పట్టించేటట్లున్నావే? అంటూ తల్లిని నిలదీసిన బాలుడు
కూకట్ పల్లి లో జరిగిన బాలిక హత్య కేసులో బాలుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. బాలుడే బ్యాట్ కోసం దొంగతనానికి వచ్చి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.

కూకట్ పల్లి లో జరిగిన బాలిక హత్య కేసులో బాలుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. బాలుడే బ్యాట్ కోసం దొంగతనానికి వచ్చి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం కూకట్ పల్లిలో బాలిక ఇంటి పక్క అపార్ట్ మెంట్లోనే ఉంటున్న బాలుడు టెర్రస్ పై నుంచి లోనికి ప్రవేశించాడు. ఆసమయంలో బాలిక నిద్రపోతుంది. క్రికెట్ బ్యాట్ ను దొంగిలించి తిరిగి వెళ్లాలని భావించాడు. కానీ చప్పుళ్లకు ఆ బాలిక మేల్కొనడంతో బాలుడు వెంటనే బాలిక గొంతు నులిమిన తర్వాత చనిపోలేదని భావించి పద్దెనిమిది సార్లు కత్తితో పొడిచారని పోలీసులు వివరించారు.
చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత...
బాలిక చనిపోయిందని తెలుసుకున్న తర్వాత తిరిగి ఇంటికి వచ్చే ముందు రక్తంతో ఉన్న కత్తిని అక్కడే కడిగేసుకున్నాడు. తర్వాత రక్తంతో తడిసిపోయిన తన బట్టలను వాషింగ్ మెషిన్ లో వేశాడని, అయితే ఫోరెన్సిక్ నిపుణులు దుస్తులపై రక్తపు మరకలను గుర్తించారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తన తండ్రి ఇంట్లోనే ఉండటంతో సాధారణంగానే వచ్చి తన పనులు చేసుకున్నాడని తెలిపారు. ఎక్కువగా ఓటీటీల్లో క్రిమినల్ సిరీస్ చూస్తూ దొంగతనం ఎలా చేయాలన్న దానిపై బాలుడు ఒక పుస్తకంలో రాసుకున్నాడని కూడా పోలీసులు తెలిపారు. దానిని కూడా స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
పోలీసు విచారణలో...
అయితే పక్క భవనంలో ఉన్న బాలిక హత్య కు గురికావడంతో బాలుడి తల్లికి అనుమానం వచ్చిందని, ఏందిరా నువ్వు ఏమైనా ఈ పనిచేశావా? అని ప్రశ్నించడంతో నన్ను అవమానిస్తున్నావా? అమ్మా.. నువ్వే పోలీసులకు పట్టించేలా ఉన్నావే అని ఎదురు ప్రశ్నించడంతో ఆ తల్లి మౌనంగా ఉండిపోయిందని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన తర్వాత పోలీసుల విచారణలో కూడా సాధారణంగానే మాట్లాడాడని, నాన్నా నాన్నా అని బాలిక అరిచిందని పోలీసులకు చెప్పాడని అందుకే బాలుడిపై తొలుత అనుమానం రాలేదనిపోలీసులు తెలిపారు. తర్వాత వచ్చిన అనుమానాలు, అనేక మందిని విచారించిన మీదట బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం అంగీకరించాడని తెలిపారు. గత ఐదు రోజులు నుంచి ఐదు బృందాలు ఈ కేసును విచారించి చివరకు నిందితుడెవరో తేల్చారన్నారు. ఈమేరకు పోలీసు ఉన్నతాధికారి మహంతి మీడియాకు వివరాలు వెల్లడించారు.
Next Story

