Thu Mar 19 2026 05:29:26 GMT+0530 (India Standard Time)
Hyderabad : రేపంతా హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్
రేపు మద్యం దుకాణాలను మూసి వేయాలని పోలీసు అధికారులు దుకాణ యజమానులను ఆదేశించారు

రేపు మద్యం దుకాణాలను మూసి వేయాలని పోలీసు అధికారులు దుకాణ యజమానులను ఆదేశించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి 18వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ జంటనగరాల పరిధిలో ఉండే మద్యం దుకాణాలను బంద్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి నిర్ణయించారు.
శ్రీరామ నవమి సందర్భంగా...
సీతారాముల కల్యాణం కావడంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నారు. మద్యం దుకాణాలను మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో రేపటి కోసం ఇప్పటి నుంచే మందుబాబులు మద్యాన్ని కొనుగోలు చేయడానికి క్యూ కట్టారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషన్ మాత్రం రేపు మద్యం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story

