Fri Dec 05 2025 16:45:06 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణదినం జరగనుంది

హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణదినం జరగనుంది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఈరోజు అన్ని జిల్లాల్లోని పోలీస్ కార్యాలయాల్లోనూ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
31వ తేదీ వరకూ...
పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ఈ నెల 31వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. భారతదేశంలో 191 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారని, వారిని స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. దీంతో పాటు పోలీసు సిబ్బంది ధైర్య సాహసాలను వివరించే బుక్ లెట్ ను సురక్ష ప్రచురిస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
Next Story

