Sat Dec 13 2025 05:57:31 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : నేడు ఉప్పల్ స్టేడియానికి వెళ్లాలంటే వీటిని తీసుకెళ్లకూడదు
ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. టికెట్లు ఉన్నవాళ్లే మ్యాచ్ కు రావాలని పోలీసు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. మెస్సీ గోట్ ఇండియా టూర్ కు మూడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ల్యాప్ టాప్స్, బ్యానర్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పెన్నులు, బ్యాటరీలు, తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, సిగరెట్లకు అనుమతి లేదని సీపీ సుధీర్ బాబు చెప్పారు.
ఈరోజు రాత్రి ఏడు గంటలకు...
ఈరోజు రాత్రి ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ లో మెస్సీ, ముఖ్యమత్రి రేవంత్ రెడ్డితో పాటు అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్లు పాల్గొననుండటతో పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలోకి వచ్చే వారిని అణువణువూ పరీక్షించిన తర్వాత మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం నుంచి స్టేడియంలోకి అనుమతిస్తారు.
Next Story

