Thu Dec 18 2025 07:38:45 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad Traffic: నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
భారీ వాహనాలు, ట్రక్కుల విషయంలో అధికారులు కీలక సూచనలు

శనివారం నాడు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సూచనలను జారీ చేశారు.
భారీ వాహనాలు, ట్రక్కుల రాకపోకల విషయంలో అధికారులు కీలక సూచనలు చేశారు. చెంగిచెర్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే వాహనాలను భగాయత్ రోడ్డు వద్ద నాగోల్ వైపు మళ్లిస్తారు. ఎల్బీ నగర్ నుంచి నాగోల్ లేదా ఉప్పల్ వైపు వెళ్లే ప్రయాణికులను నాగోల్ మెట్రో స్టేషన్లో మళ్లిస్తారు. ఈ వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్ - హెచ్ఎండీఏ లేఅవుట్ - బోడుప్పల్ - చెంగిచెర్ల ఎక్స్ రోడ్ మార్గంలో వెళ్లాలని సూచించారు. తార్నాక నుంచి ఉప్పల్ వైపు వెళ్లే వాహనాలను హబ్సిగూడ ఎక్స్ రోడ్డు వద్ద మళ్లించనున్నారు. వారిని నాచారం - ఐఓసీఎల్ చెర్లపల్లి వైపు వెళ్లాలని సూచించారు. రామాంతపూర్ నుంచి ఉప్పల్ వెళ్లే వారిని దారి మళ్లించి హబ్సిగూడ వీధి నెం.8 మీదుగా ఉప్పల్ ఎక్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
Next Story

