Sat Dec 13 2025 22:32:56 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పోలీస్ కస్టడీకి ఇమ్మడి రవి
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నేడు పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నేడు పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. చంచల్ గూడ జైలులో ఉన్న ఇమ్మడి రవిని తమకస్టడీలోకి తీసుకోనున్నారు. ఐదు రోజుల పాటు ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో అన్ని విషయాలను లోతుగా దర్యాప్తు చేసేందుకు ఇమ్మడి రవిని కస్టడీకి అనుమతించాలని కోరడంతో కోర్టు ఐదు రోజుల పాటు అనుమతించింది.
ఐదు రోజుల పాటు...
దీంతో ఇమ్మడి రవిని నేడు చంచల్ గూడ జైలు నుంచి తీసుకుని విచారించనున్నారు. ఇప్పటికే ఐ బొమ్మ, బప్పం వెబ్ సైట్లను మూసివేశారు. దీంతో పాటు హార్డ్ డిస్క్ లతో పాటు, ఇంకా క్రిప్టో కరెన్సీ ద్వారా, విదేశాల నుంచి నిధులను రప్పించుకోవడం వంటి అంశాలపై ఇమ్మడి రవిని ఈ ఐదు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు ప్రశ్నించే అవకాశముంది.
Next Story

