Fri Dec 05 2025 12:37:25 GMT+0000 (Coordinated Universal Time)
పాతబస్తీలో భారీ బందోబస్తు
ఈరోజు శుక్రవారం కావడంతో ఎలాంటి అవాఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు హైదరాబాద్ పాతబస్తీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు

పాతబస్తీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు శుక్రవారం కావడంతో తిరిగి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్త పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గత శుక్రవారం ప్రార్థనలు చేసిన తర్వాత ఒక్కసారిగా ముస్లింలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రోడ్లపైకి ఒక్కసారిగా ముస్లింలు రావడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు.
జగదీష్ మార్కెట్....
ఈరోజు శుక్రవారం కావడంతో ఎలాంటి అవాఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పాతబస్తీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జగదీష్ మార్కెట్ వ్యాపారులు ఈరోజు బంద్ ను పాటిస్తున్నారు. గత శుక్రవారం దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయడంతో ముందస్తు చర్యలు చేపట్టారు.
Next Story

