Sun Feb 01 2026 22:15:03 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో మూడు కోట్ల విలువైన బంగారు ఆభరణాల స్వాధీనం
హైదరాబాద్ నగరంలో పోలీసులు పెద్దయెత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ నగరంలో పోలీసులు పెద్దయెత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 3.16 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎస్.ఓ.టీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్, మేడ్చల్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బంగారాన్ని ఎందుకు? ఎక్కడకు తీసుకెళుతుందన్న దానిపై నిందితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తనిఖీలు చేస్తుండగా....
పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో నగరంలో పెద్దయెత్తున పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో ఇప్పటికే కోట్ల రూపాయల నగదును పట్టుకున్నారు. తాజాగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానికి సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవడంతో పట్టుకున్నామని తెలిపారు. నిందితులను విచారించనున్నారు.
Next Story

