Fri Dec 05 2025 08:12:25 GMT+0000 (Coordinated Universal Time)
దానం నాగేందర్ పై కేసు నమోదు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయన అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన భూమిలో ఉన్న కాంపౌండ్ వాలన్ ను కూల్చి వేశారని ఆయనపై ఈ కేసు నమోదయింది.
ప్రహరీ గోడను...
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 69లోని నందగిరి హిల్స్ లోని గురుబ్రహ్మ నగర్ కాలనీలో 800 గజాల స్థలంలో ఉన్న ప్రహరీ గోడను దానం నాగేందర్ అనుచరులు కూల్చివేశారు. ఆయన అనుచరులు గోపాల్ నాయక్, రాంచదర్ లు ఈ గోడను కూల్చి వేయించారు. దీనిపై జీహెచ్ఎంసీీ అధికారులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story

