Wed Jan 28 2026 23:50:43 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన టీం మీద కూడా కేసు నమోదు చేశారు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన టీం మీద కూడా కేసు నమోదు చేశారు. నిన్నసంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఒక బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనకు నిర్లక్ష్యమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
సమాచారం లేకపోవడంతోనే...
అల్లు అర్జున్ థియేటర్ కువస్తున్నారన్న ముందస్తు సమాచారం లేకపోవడంతోనే సరైన భద్రత ఏర్పాట్లు చేయలేదని సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా చెబుతుంది. అనుకోకుండా రావడంతో అభిమానుల తొక్కిసలాట జరిగి ఈ దురదృష్టకరమన ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. అయినా కూడా సంధ్యాథియేటర్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story

