Fri Dec 05 2025 09:29:50 GMT+0000 (Coordinated Universal Time)
ఎంఎంటీఎస్‌లో అత్యాచార ఘటనపై క్లారిటీ
ఎంఎంటీఎస్‌లో అత్యాచార ఘటనపై పోలీసుల క్లారిటీ ఇచ్చారు.

ఎంఎంటీఎస్‌లో అత్యాచార ఘటనపై పోలీసుల క్లారిటీ ఇచ్చారు. అత్యాచారమే జరగలేదని కేస్ క్లోజ్ చేసిన పోలీసులు అందుకు గల కారణాలు కూడా తెలిపారు. ఇన్‌స్టా రీల్స్ చేస్తూ రైలు నుంచి జారిపడిన యువతి దాన్ని కప్పిపుచ్చేందుకు అత్యాచారం పేరుతో కట్టుకథ అల్లినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. తాము సమగ్రంగా విచారించిన మీదట ఈ విషయం బయటకు వచ్చిందని రైల్వే పోలీసులు తెలిపారు.
సీసీటీవీ కెమెరాల ఫుటేజీని...
250 సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు100 మంది అనుమానితులను విచారించినట్లు తెలిపార. ఎక్కడా ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో గందరగోళం నెలకొనడంతో రైల్వే పోలీసులు జరిపిన విచారణలో తనపై అత్యాచారం జరగలేదని యువతి అంగీకరించిందని తెలిపారు. అయితే న్యాయసంబంధమైన అంశాలను పరిశీలించిన తర్వాత ఈ కేసును క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు.
Next Story

