Fri Dec 05 2025 14:25:40 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో హై అలెర్ట్.. తనిఖీలు ముమ్మరం
హైదరాబాద్ లో పోలీసులు హై అలెర్ట్ ను జారీ చేశారు. పహాల్గాం దాడి ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు

హైదరాబాద్ లో పోలీసులు హై అలెర్ట్ ను జారీ చేశారు. పహాల్గాం దాడి ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో పాటు హైదరాబాద్ లో పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారత ప్రభుత్వం వారం రోజుల్లో పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశించిన నేపథ్యంలో అన్ని చోట్ల తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పాక్ పౌరుల అన్ని వీసాలను రద్దు చేయడంతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
సున్నిత ప్రాంతాల్లో తనిఖీలు...
ముఖ్యంగా సున్నిత ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. ఎవరైనా అనుమానితులు కనిపించినా, అద్దెకు దిగినా తమకు సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు కోరుతున్నారు. కొత్త వారిపై నిరంతరం నిఘా ఉంచుతూ అవసరమైన సమయంలో పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరుతున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో నాకా బందీని కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేయనున్నారు.
Next Story

