Thu Mar 19 2026 04:42:53 GMT+0530 (India Standard Time)
ట్యాంక్‌బండ్ పై ఆంక్షలు.. ఎప్పటి వరకూ అంటే?
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. అటు వైపు ఎవరూ వాహనాలతో వెళ్లరాదని ఉత్తర్వుల్లో కోరారు

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. అటు వైపు ఎవరూ వాహనాలతో వెళ్లరాదని ఉత్తర్వుల్లో కోరారు. ఇప్పటికే గణనాధులు ట్యాంక్‌బండ్ కు నిమజ్జనానికి చేరుకుంటుండటంతో పోలీసులు ట్యాంక్‌బండ్ పై వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కేవలం గణనాధులు, పాదచారులకు మాత్రమే అనుమతిస్తున్నారు.
రేపు శోభాయాత్ర...
రేపు హైదరాబాద్ లో గణేశ్ శోభాయాత్ర జరుగుతుంది. వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్ పై నిమజ్జనం కానున్న సందర్భంగా పోలీసులు గణేశ్ విగ్రహాలకు ఇబ్బంది కలగకుండా ఈ ఆంక్షలు విధించారు. రేపు రాత్రి వరకూ ట్యాంక్ బండ్ పై గణనాధుల నిమజ్జనం కొనసాగుతుందని భావిస్తున్నారు. అప్పట ివరకూ ఈ ఆంక్షలు కొనసాగే అవకాశముంది.
Next Story

