Tue Jan 20 2026 23:32:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పంజాగుట్ట స్టేషన్ లో సిబ్బంది అందరిపై బదిలీ వేటు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న అందరినీ బదిలీ చేశారు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న అందరినీ బదిలీ చేశారు. 85 మందిని బదిలీ చేస్తూ పీలసు కమిషనర్ శ్రీనివాసులు రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకూ అందరినీ బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ తీసుకున్న నిర్ణయం నిజంగా పోలీసు శాఖలో సంచలనమే
తొలిసారి ఈ తరహా ఆదేశాలు...
తొలిసారి ఈ తరహా ఆదేశాలు పోలీస్ కమిషనర్ జారీచేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బందిపై అనేక ఆరోపణలు వస్తుండంతో పోలీసు కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు వివాదం విషయంలో పోలీసు కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.వారి స్థానంలో కొత్త వారిని నియమించారు.
Next Story

