Thu Jan 22 2026 01:25:35 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీతేజ్ ను పరామర్శించిన సీవీ ఆనంద్
సంథ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ను పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరామర్శించారు

సంథ్య థియేటర్ లో పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ను పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తొక్కిసలాటలో గాయపడి పదమూడు రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీతేజ తల్లి రేవతి ఈ ఘటనలో మరణించిన విషయమూ విదితమే.

బ్రెయిన్ డ్యామేజీ కావడంతో...
ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టయి జైలుకెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినాలు ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు.తర్వాత సీవీ ఆనంద్ మాట్లాడుతూ ఈ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ఆన తెలిపారు. బ్రెయిన్ డ్యామేజీ జరిగిందన్నారు. బాలుడి వైద్యానికి అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని సీవీ ఆనంద్ ఈ సందర్బంగా మీడియాకు చెప్పారు.
Next Story

