Sat Mar 07 2026 05:38:00 GMT+0530 (India Standard Time)
రేవ్ పార్టీ భగ్నం
హయత్ నగర్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 29 మంది యువకులు, నలుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

హయత్ నగర్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 29 మంది యువకులు, నలుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హైదరాబాద్ శివారుల్లోని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. అయితే పోలీసు సోదాల్లో వీరివద్ద గంజాయి లభించినట్లు సమాచారం.
బర్త్ డే...
పదకొండు కార్లతో పాటు 28 మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ స్నేహితుడి బర్త్డే సందర్భంగా ఈ రేవ్ పార్టీని వారు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
- Tags
- rave party
- police
Next Story

