Sun Mar 08 2026 01:05:12 GMT+0530 (India Standard Time)
Breaking : ఐపీఎస్ నవీన్ కుమార్ అరెస్ట్
ఐపీఎస్ నవీన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ఐపీఎస్ నవీన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఏఎస్ అధికారి ఇంట్లో ఉంటూ ఆ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లోని మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ ఇంటిని కబ్జా చేసేందకు నవీన్ కుమార్ ప్రయత్నించారని ఆయనపై ఫిర్యాదు అందడంతో ఇటీవల సీసీఎస్ పోలీసులు ఆయనను పిలిచి విచారించారు.
ఇల్లు ఖాళీ చేసినా...
అయితే ఆయన తర్వాత ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పటికే నవీన్ కుమార్ అన్న, వదినలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా నవీన్ కుమార్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన రాష్ట్ర పోలీసు అకాడమీలో జాయింట్ డైెరెక్టర్ గా పనిచేస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారన్న కారణాలతో ఆయనను అరెస్ట్ చేశారు.
Next Story

