Sat Dec 13 2025 22:32:55 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఐ బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్?
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు

ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం కూకట్ పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిన్ననే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న రవిని పక్కా సమాచారంతో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ వెబ్ సైట్ ను రన్ చేస్తున్నట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. కొత్తగా విడుదలయ్యే ప్రతి సినిమా ఐ బొమ్మలో ప్రత్యక్షం కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించారు.
హైదరాబాద్ కు వచ్చిన...
ఐబొమ్మ, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, ప్రైమ్, జియో హాట్ స్టార్, ఆహా వంటి ఓటీటీల్లోని కంటెంట్ ను కూడా కూడా నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి ఐబొమ్మలో అప్ లోడ్ కావడంతో దీనిపై పలువురు నిర్మాతలు, ఓటీటీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు సినీ నిర్మాతల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగర పోలీసులు దీనిపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు వచ్చిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశముందని తెలిసింది.
Next Story

