Thu Mar 19 2026 08:00:05 GMT+0530 (India Standard Time)
Hyderabad : అందుకే ఫ్లైఓవర్లన్నీ మూసివేస్తున్నాం
డిసెంబరు 31వ తేదీ రాత్రికి నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు మూసివేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు

డిసెంబరు 31వ తేదీ రాత్రికి నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు మూసివేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. శాంతిభద్రతల దృష్ట్యా అన్ని ఫ్లైఓవర్ లను మూసివేస్తామని తెలిపారు. పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లై ఓవర్ పై ఎవరినీ ఆరోజు అనుమతించబోమని, అయితే ఎయిర్ పోర్టుకు వెళ్లే వారికి మాత్రం అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు.
ప్రమాదాల నివారణకే...
మద్యం తాగి రోడ్డు ప్రమాదాలు నివారించడానికే ఫ్లై ఓవర్లను మూసివేయాలని నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు. ఫ్లై ఓవర్లపై మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని భావించి వాటిని మూసివేస్తున్నట్లు తెలిపారు. మద్యం తాగి ఎవరు డ్రైవింగ్ చేసినా వెంటనే పరీక్షలు చేసి అరెస్ట్ చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
Next Story

