Fri Dec 05 2025 11:18:31 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ బస్సుల కు పెరిగిన రద్దీ
ప్రయివేటు ట్రావెల్స్ బస్సులకు ప్రయాణికుల రద్దీ తగ్గింది. ఆర్టీసీ బస్సులకు తాకిడి పెరిగింది

ప్రయివేటు ట్రావెల్స్ బస్సులకు ప్రయాణికుల రద్దీ తగ్గింది. ఆర్టీసీ బస్సులకు తాకిడి పెరిగింది వాటిలో ప్రయాణించేందుకు ప్రయాణికులు భయపడుతున్నారు. కర్నూలు వద్ద బస్సు ప్రమాద దుర్ఘటనతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాల వైపు వెళ్లడం లేదు. ఫలితంగా ఆన్ లైన్ రిజర్వేషన్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల సీట్లన్నీ ఖాళీగా కనిపించాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు రద్దీగా మారాయి. ప్రయాణికులతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 200కు పైగా బస్సు సర్వీసుల్లో సీట్లన్నీ నిండిపోయాయి.
అదనపు సర్వీసులు...
దీంతో పలు ప్రాంతాలకు అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. కర్నూలు వద్ద వేమూరి కావేరి బస్సు దగ్ధం దుర్ఘటన దృష్ట్యా ప్రమాదాల నివారణ కోసం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలో బస్సులు గమ్య స్థానాలకు వచ్చాక తనిఖీ చేస్తుండగా.. ఆర్టీఏ అధికారులు రూటు మార్చారు. బస్సులు బయలు దేరే ముందే రోడ్లపై పలు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడతామనే ఆందోళనతో పలువురు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు బస్సులను రోడ్డెక్కించడం లేదు.
Next Story

