Fri Dec 05 2025 14:44:49 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి పనులు ప్రారంభం
ఉస్మానియా జనరల్ ఆస్పత్రి కొత్త భవనాల నిర్మాణ పనులకు సంబంధించిన పనులు నేడు ప్రారంభమయ్యాయి

ఉస్మానియా జనరల్ ఆస్పత్రి కొత్త భవనాల నిర్మాణ పనులకు సంబంధించిన పనులు నేడు ప్రారంభమయ్యాయి. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఈ పనులను ప్రారంభించింది. గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఈ పనులు మొదలయ్యాయి. దసరా సందర్భంగా మెగా ఇంజినీరింగ్ కంపెనీ అధ్యక్షుడు కె.గోవర్ధన్‌రెడ్డి పూజలు నిర్వహించి పనులకు శంకుస్థాపన చేశారు.
గోషామహల్ లో...
ఈ ఏడాది జనవరి 31న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి గోషామహల్ లో ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. అధికారికంగా ఈరోజు నుంచి పనులు మొదలయ్యాయి. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో నిర్మించేలా డిజైన్లను రూపొందించారు. అన్ని రకాల వసతులను సమకూరుస్తున్నారు.
Next Story

