Thu Mar 19 2026 07:04:59 GMT+0530 (India Standard Time)
మందుబాబులకు బ్యాడ్‌న్యూస్
శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపులను ఒకరోజు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది

శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపులను ఒకరోజు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరామనవమి పండగ సందర్భంగా సిటీలో మద్యం దుకాణాల బంద్. వైన్ షాపులు, కళ్ళు దుకాణాలు, బార్లు, రిజిస్టర్ క్లబ్‌లు ,పబ్‌లు ఇంక్లూడింగ్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో బార్ రూమ్స్ మూసేయాలని ఆదేశించింది.
ఎల్లుండి ఉదయం నుంచి...
ఈ నెల 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31 వ తారీకు ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 24 గంటల పాటు మద్యం దుకాణాలతో పాటు బార్లు కూడా బంద్ చేయాలని నగర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Next Story

