Wed Mar 25 2026 12:51:27 GMT+0530 (India Standard Time)
Hyderabad : పెట్రోలు కొరత లేదు : డీలర్స్ అసోసియేషన్
హైదరాబాద్ లో పెట్రోలు, గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి

హైదరాబాద్ లో పెట్రోలు, గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదని, ఒక్కసారిగా పెట్రోలు, డీజిల్ కోసం క్యూ కడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించాయి. దేశంలో ఇంధన కొరత లేదని పెట్రోలు డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
క్యాన్లలో నింపడం...
డబ్బాల్లో, క్యాన్లలో పెట్రోలు నిల్వ ఉంచుకోవద్దని పెట్రోలు డీలర్స్ అసోసియేషన్ చెప్పింది. అది ప్రమాదకరమని, నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. పెట్రోలు బంకులు మూసేస్తారన్న వదంతలు నమ్మవద్దని పెట్రోలు డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. సాధారణం కంటే మూడు రెట్లు పెట్రోలు, డీజిల్ కోసం ప్రజలు బంకుల వద్ద క్యూ కడుతున్నారని, సరఫరా వ్యవస్థ సాధారణంగానే కొనసాగుతుందని తెలిపారు.
Next Story

