Mon Dec 15 2025 07:27:12 GMT+0000 (Coordinated Universal Time)
కల్తీ కల్లు ఘటనలో పెరుగుతున్న మృతులు
కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఎనిమిది మందికి చేరింది

కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఎనిమిది మందికి చేరింది. ఆదివారం ఉదయం కల్లు కాంపౌండ్ లో తాగిన వారు సోమవారం నుంచి వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరారు. దాదాపు 34 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కల్తీకల్లు తాగి ఎనిమిది మంది మరణించారు. తాజాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదర్శనగర్ ఇంద్రహిల్స్ కాలనీకి చెందిన చాకలి పెద్ద గంగారాం మృతి చెందాడు.
ఎనిమిదికి చేరిన...
గంగారం వయసు డెబ్భయి ఏళ్లు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కెమికల్స్ కలపడం వల్లనే మరణాలు సంభవించాయని నివేదికలో ప్రాధమికంగా నిర్ధారణ అయింది. దీనికిసంబంధించి కల్లుకాంపౌండ్ యజమానులను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. కొందరు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story

