Mon Mar 16 2026 17:04:06 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: ఎన్టీఆర్ కుమార్తె కన్నుమూత
బ్రేకింగ్: ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కన్నుమూత

స్వర్గీయ నందమూరి తారకరామారావు నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఉమామహేశ్వరి హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఉమామహేశ్వరి మృతితో నందమూరి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఉమామహేశ్వరి మృతి సమాచారం తెలియగానే నందమూరి కుటుంబసభ్యులతోపాటు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ఆమె ఇంటికి వెళ్లారు. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తె వివాహం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

