క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ఇద్దరు హీరోలతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం తారక్ క్షమాపణలు కోరుతూ ఎక్స్ లో ఓ వీడియో విడుదల చేశారు. ఈ ఈవెంట్ సజావుగా జరిగి, గ్రాండ్ సక్సెస్ కావడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి స్టేజీ మీద ధన్యవాదాలు చెప్పడం మరిచిపోయినందుకు క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమైన విషయం చెప్పడం మరిచిపోయానని, ఈవెంట్ సజావుగా జరిగేందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని తెలిపారు తారక్. సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందించిన మద్ధతుకు ధన్యవాదాలు తెలిపారు.

