Fri Dec 05 2025 22:19:10 GMT+0000 (Coordinated Universal Time)
అత్తాపూర్ లడ్డూ గుమ్మడి బ్రదర్స్ సొంతం.. రికార్డు ధరకు
అత్తాపూర్ అత్యంత మహిమానిత్వ పురాతన పోచమ్మ ఆలయం వద్ద ఉన్న "న్యూ స్టార్స్ భక్త సమాజ్" గణేశ్ లడ్డు రికార్డు ధర పలికింది. లడ్డూని గుమ్మడి బ్రదర్స్ భూపాల్ రెడ్డి దక్కించుకున్నారు.

హైదరాబాద్ లో గణేశ్ లడ్డూలకు ఈసారి అత్యంత ధర పలుకుతుంది. వేలం పాటలో పోటీ పడి మరీ గణేశ్ లడ్డూను సొంతం చేసుకుంటున్నారు. ఈసారి అత్తాపూర్ అత్యంత మహిమానిత్వ పురాతన పోచమ్మ ఆలయం వద్ద ఉన్న "న్యూ స్టార్స్ భక్త సమాజ్" గణేశ్ లడ్డు రికార్డు ధర పలికింది. లడ్డూని గుమ్మడి బ్రదర్స్ భూపాల్ రెడ్డి దక్కించుకున్నారు. వేలం పాటలో గత రికార్డ్ ని అధికమిస్తూ 12.51 లక్షలకు గుమ్మడి బ్రదర్స్ భూపాల్ రెడ్డి దక్కించుకున్నారు. గత ఏడాది కంటే.. ఈసారి రూ.1 లక్ష 35000 రూపాయలు అదనంగా వేలంలో లడ్డూ ధర పలికింది. అత్తాపూర్ లో లడ్డూ వేలంలో ఇదే రికార్డ్ అని స్థానికులు చెబుతున్నారు.
యాభై మంది పాల్గొనగా..
అత్తాపూర్ లడ్డూ ప్రసాదం వేలం పోటాపోటీగా సాగింది. అత్తాపూర్ గణేశుడితో పాటు పది రోజులు భక్తులతో పూజలను అందుకున్న లడ్డూ రికార్డ్ ధర పలికింది. అత్తాపూర్ అత్యంత మహిమానిత్వ పురాతన పోచమ్మ ఆలయం వద్ద ఉన్న "న్యూ స్టార్స్ భక్త సమాజ్" కమిటీ గణేష్ సభ్యులు, నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపారు. లడ్డూ ప్రసాదం దక్కించుకునేందుకు చివరి వరకు పోటీ పడ్డారు. నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో లడ్డూ చివరకు 12.51 లక్షలకు గుమ్మడి బ్రదర్స్ భూపాల్ రెడ్డి అత్తాపూర్ లడ్డూ స్వామివారి ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు.. దాదాపు 50 మంది సభ్యులు వేలంపాటలో పాల్గొన్నారు.
Next Story

