Sun Jul 20 2025 06:59:17 GMT+0000 (Coordinated Universal Time)
నయా మోసం.. పెళ్లి చేసుకోడానికి నైజీరియా నుండి వస్తారు
హైదరాబాద్ నగరంలో గతంలో గల్ఫ్ షేక్‌లు పేద యువతులను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన ఘటనలు మనం చూశాం.

హైదరాబాద్ నగరంలో గతంలో గల్ఫ్ షేక్‌లు పేద యువతులను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన ఘటనలు మనం చూశాం. అయితే ఇప్పుడు కొందరు నైజీరియన్లు కూడా ఇలాంటి మార్గాన్నే ఎంచుకున్నారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లో చట్టవిరుద్ధంగా నివసించేందుకే వారు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
విద్య, వ్యాపారం పేర్లతో నగరానికి వస్తున్న కొందరు నైజీరియన్లు సైబర్ నేరాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వీసా గడువు తీరిపోయాక, ఇక్కడే ఉండిపోయేందుకు ‘కాంట్రాక్ట్ పెళ్లిళ్ల’కు తెరదీశారు. అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుతో దళారుల ద్వారా పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కుటుంబ పెద్దలకు డబ్బు ఆశ చూపి, వారి ఇంట్లోని యువతులను పెళ్లి చేసుకుంటున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆ యువతులను వదిలేసి వెళ్లిపోతున్నారు.
Next Story