Sun Dec 08 2024 07:10:57 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi Road Show: నేడు ప్రధాని రోడ్ షో.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని నరేంద్రమోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించ నున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షోలో పాల్గొననున్నారు
Narendra Modi Road Show:ప్రధాని నరేంద్రమోదీ నేడు, రేపు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షోలు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈరోజు మల్కాజ్‌గిరిలో జరిగే రోడ్ షో లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. రోడ్ షోకు ఏర్పాట్లు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారులు చేశారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకూ మల్కాజ్‌గిరిలో రోడ్డు షో నిర్వహిస్తున్నారు. రోడ్డు మార్గాన 6.40 గంటలకు రాజ్‌భవన్ కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
శనివారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 12 గంటలకు నాగర్‌కర్నూలుకు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఒంటిగంటకు నాగర్ కర్నూలు నుంచి హెలికాప్టర్ లో కర్ణాటకలోని గుల్బర్గాకు బయుదేరి తిరిగి 18వ తేదీన తెలంగాణకు ఆయన వస్తారు. ప్రధాని రాక సందర్భంగా నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. సాయంత్రం 4.40 గంటల నుంచి ఏడు గంటల మధ్య బేగంపేట, పీఎస్టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీవో, ప్లాజా, సెయింట్ జాన్స్ రోడ్డు, సంగీత్ ఎక్స్‌రోడ్, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, రైల్వే ఆసుపత్రి, మల్కాజ్గిరి ఆర్చి లాలాపేట్, తార్నాక, గ్రీన్ ల్యాండ్స్, మోనప్ప జంక్షన్, రాజ్‌భవన్, ఎంఎంటీఎస్ జంక్షన్, వీవీ విగ్రహం మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు.
Next Story