Sat Dec 13 2025 22:32:20 GMT+0000 (Coordinated Universal Time)
ఓ ఇంటివాడైన నారా రోహిత్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు, నటుడు నారా రోహిత్, శిరీషల వివాహం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు, నటుడు నారా రోహిత్, శిరీషల వివాహం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష నటించారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల.రోహిత్ తండ్రి దివంగత కె.ఎస్.నారా రామ్మూర్తి నాయుడి మొదటి శ్రాద్ధ సంవత్సరికం తర్వాత ఈ పెళ్లి జరిగింది.
Next Story

