Thu Mar 19 2026 06:40:50 GMT+0530 (India Standard Time)
Allu Arjun : నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై తీర్పు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెయిల్ పిటీషన్ పై నేడునాంపల్లి కోర్టు తీర్పు చెప్పనుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు చెప్పనుంది. సంథ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, శ్రీతేజ్ అనే బాలుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్ తో ఆయన బయటకు వచ్చారు.
బెయిల్ ఇప్పించాలని...
అయితే తనకు ఈ కేసులో బెయిల్ ఇప్పించాలని అల్లు అర్జున్ వేసిన పిటీషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ కు ఈ తీర్పు కీలకమనే చెప్పాలి. గత నెల 11వ తేదీన సంథ్యా థియేటర్ లో పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి మహిళ మరణించిన కేసులో అల్లు అర్జున్ నిందితుడిగా ఉన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

