Thu Jan 08 2026 05:06:22 GMT+0000 (Coordinated Universal Time)
ఐబొమ్మ రవి బెయిల్ నిరాకరణ
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిం

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తన ఐ బొమ్మ వెబ్ సైట్ ద్వారా పైరసీ సినిమాలను చూపిస్తూ చిత్ర పరిశ్రమ ఆదాయానికి గండి కొడుతున్నారని పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఇమంది రవిపై పలు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులన్నింటిలో తనకు బెయిల్ ఇవ్వాలని రవి తరుపున న్యాయవాదులు పిటీషన్ వేశారు.
ఐదు కేసుల్లో...
మొత్తం ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ ఐబొమ్మ రవి తన పిటీషన్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదయిన ఐదు కేసుల్లోనూ బెయిల్ ఇవ్వడం కుదరదని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. రవికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం విడిచిపోయే అవకాశముందని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు వాదించారు. దీంతో బెయిల్ పిటీషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.
Next Story

