Wed Jan 28 2026 16:59:34 GMT+0000 (Coordinated Universal Time)
రాజాసింగ్ రిమాండ్ తిరస్కరణ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి న్యాయస్థానం తీర్పు చెప్పింది.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆయనను రిమాండ్ కు తీసుకోవాలన్న పోలీసుల అభ్యర్థనను న్యాయస్థానం తోసి పుచ్చింది. రాజాసింగ్ ను వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రాజాసింగ్ న్యాయవాదుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడంపై రాజాసింగ్ న్యాయవాదులు న్యాయవాదుల దృష్టికి తీసుకెళ్లారు.
14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత....
తొలుత రాజాసింగ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన విధానాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. దాదాపు నలభై ఐదు నిమిషాలు పాటు సాగిన వాదనలు విన్న నాంపల్లి న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. కేసు పెట్టడంలో న్యాయపరంగా పోలీసులు వ్యవహరించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆయనను చంచల్ గూడకు తరలించాన్న ప్రయత్నంలో పోలీసులు ఉండగానే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది.
Next Story

