Fri Dec 05 2025 10:02:01 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ నేరాల్లో దూసుకుపోతుందిగా..?
ఆర్థిక నేరాల్లో ముంబయి అగ్రస్థానం దక్కించుకుంది. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.

ఆర్థిక నేరాల్లో ముంబయి అగ్రస్థానం దక్కించుకుంది. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి, మెట్రో నగరాల్లో ఆర్థిక నేరాల కేసుల్లో అగ్రస్థానంలో నిలిచింది. 2023లో మొత్తం 6,476 కేసులు నమోదయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు వెల్లడించాయి. అయితే 2022లో 6,960 కేసులు ఉండగా, 2023లో 484 కేసులు తగ్గాయని డేటా చూపిస్తోంది. 2021లో 5,671 కేసులు, 2022లో 6,960 కేసులు నమోదయ్యాయి. వీటిలో 37.9 శాతం కేసుల్లోనే ఛార్జ్షీట్లు దాఖలు అయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. మెట్రో నగరాల జాబితాలో ముంబయి తరువాత హైదరాబాద్ 5,728 కేసులతో రెండో స్థానంలో, జైపూర్ 5,304 కేసులతో మూడో స్థానంలో నిలిచాయి.
హైదరాబాద్ రెండో స్థానంలో...
మహారాష్ట్రలో ఆర్థిక మోసాల సంఖ్య వరుసగా పెరుగుతోంది. 2021లో 15,550 కేసులు ఉండగా, 2022లో 18,729, 2023లో 19,803కి చేరింది. మొత్తం కేసుల్లో 54.9 శాతం కేసులకు ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. దేశవ్యాప్తంగా 2023లో రాజస్థాన్ 27,675 కేసులతో అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ 26,321 కేసులతో రెండో స్థానంలో, మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. ఆర్థిక మోసాల విషయంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం. తర్వాత స్థానం బెంగళూరు నిలిచింది.
సైబర్ నేరాల్లో కర్ణాటక...
సైబర్ క్రైమ్ కేసుల్లో మహారాష్ట్ర 8,103 కేసులు నమోదు చేసి దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. కర్ణాటక 21,889 కేసులతో మొదటి స్థానంలో ఉంది. మెట్రో నగరాల్లో సైబర్ నేరాల్లో బెంగళూరు 17,631 కేసులతో మొదటి స్థానంలో, హైదరాబాద్ 4,855 కేసులతో రెండో స్థానంలో, ముంబయి 4,131 కేసులతో మూడో స్థానంలో నిలిచింది. ఇలా హైదరాబాద్ నగరం ఇటు ఆర్థిక నేరాలు, అటు సైబర్ నేరాలలో మిగిలిన మెట్రో నగరాలను పోలిస్తే మొదటి స్థానంలో నిలవడం ఇప్పుడు ఆందోళనకు దారి తీస్తుంది.
Next Story

