Thu Mar 19 2026 14:45:59 GMT+0530 (India Standard Time)
రేపటి నుంచి రంజాన్ మాసం
శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది.

శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. నిన్న నెలవంక కనిపించకపోవడంతో రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుందని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. ఈరోజు రాత్రి నుంచి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
ఉపవాస దీక్షలు...
శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం అవుతాయని ముస్లిం పెద్దలు చెప్పారు. మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు ఉండనున్నాయి. కాగా ఈ నెల 31వ తేదీన శ్రీరామనవమి కూడా రావడంతో రెండింటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మరో వైపు ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రంజాన్ మాసంలో త్వరగా ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

